దేశవ్యాప్తంగా కొత్తగా 1,96,427 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 3,511 మంది మరణించారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 69 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 3లక్షల 7వేలు దాటింది.
- మొత్తం కేసులు:2,69,48,874
- మొత్తం మరణాలు: 3,07,231
- కోలుకున్నవారు: 2,40,54,861
- యాక్టివ్ కేసులు: 25,86,782
- " class="align-text-top noRightClick twitterSection" data="">
33 కోట్లు దాటిన పరీక్షలు
దేశవ్యాప్తంగా సోమవారం 20,58,112 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 33 కోట్ల 25 లక్షల 94 వేల 176కు చేరింది.
వ్యాక్సినేషన్
దేశంలో ఇప్పటివరకు 19 కోట్ల 85 లక్షల 38 వేల 999 టీకా డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొంది.