దేశంలో కరోనా(Coronavirus update) కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 13,058 మందికి కరోనా (Coronavirus update) పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ ధాటికి(Covid cases in India) మరో 164 మంది మరణించారు. ఒక్కరోజే 19,470 మంది రికవరీ అయ్యారు.
- మొత్తం కేసులు: 3,40,94,373
- మొత్తం మరణాలు: 4,52,454
- మొత్తం కోలుకున్నవారు: 3,34,58,801
- యాక్టివ్ కేసులు: 1,83,118
టీకాల పంపిణీ
ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 98,67,69,411 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 3,42,986 మందికి వైరస్ (Corona update) సోకింది. కొవిడ్ ధాటికి మరో 4,921 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,18,70,992 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,20,294 కు పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 51,178 మందికి వైరస్ సోకింది. మరో 660 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో క్రితం రోజుతో పోల్చుకుంటే కొవిడ్ కేసులు కాస్త పెరిగాయి. కొత్తగా 49,156 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. తాజాగా 45 మృతి చెందారు.
- రష్యాలో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. తాాజాగా 34,325 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజే 998 మంది వైరస్ ధాటికి మృతి చెందారు.
- టర్కీలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. ఒక్కరోజే 29,240 మందికి వైరస్ బారిన పడగా.. 214 మంది మరణించారు.
- ఇరాన్లో కొత్తగా 11,844 మందికి కొవిడ్ సోకగా.. 181 మంది చనిపోయారు.
ఇదీ చదవండి:కరోనా వేళ.. అతి జాగ్రత్తలతో అనర్థాలు తప్పవు!