దేశంలో కొవిడ్ ఉద్ధృతి(corona cases in india) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 1,27,510 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 2,795 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,55,287 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 92.09 శాతంగా ఉంది.
- మొత్తం కేసులు: 2,81,75,044
- మొత్తం మరణాలు: 3,31,895
- కోలుకున్నవారు: 2,59,47,629
- యాక్టివ్ కేసులు: 18,95,520
ఇదీ చదవండి: corona: పసివాళ్లకు మళ్లీ మిస్సీ గండం
34.67 కోట్ల టెస్టులు..
సోమవారం ఒక్కరోజే 19,25,374 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 34,67,92,257కు చేరిందని పేర్కొంది.
వ్యాక్సినేషన్..
ఒక్కరోజే 27,80,058 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 21,60,46,638 కి చేరినట్లు చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
54 రోజుల్లో ఇవే అత్యల్పం..
54 రోజుల్లో సోమవారం అతి తక్కువ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాలు కూడా 35 రోజుల్లో ఇవే తక్కువని పేర్కొంది. రోజూవారీ పాజిటివిటీ రేటు 6.62 శాతంగా ఉందని పేర్కొంది. రోజూవారీ కేసుల కంటే.. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 19 రోజుల నుంచీ ఎక్కువగానే ఉందని తెలిపింది.
కరోనా మృతుల్లో 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్నారని.. దేశంలో ప్రస్తుత మరణాల రేటు 1.18గా ఉందని పేర్కొంది.
ఇదీ చదవండి : coronavirus: 'అది ఇండియన్ వేరియంట్ కాదు.. డెల్టా'
ఇదీ చదవండి: COVID: ఈ ఔషధంతో కొత్త వేరియంట్లకూ చెక్!