దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య (Coronavirus update) భారీగా తగ్గింది. తాజాగా 10,853 మందికి కొవిడ్ పాజిటివ్‌గా(Corona cases in India) తేలింది. కరోనా ధాటికి మరో 526 మంది మృతి చెందారు. తాజాగా 12,432 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- మొత్తం మరణాలు: 4,60,791
- యాక్టివ్ కేసులు: 1,44,845
- కోలుకున్నవారు: 3,37,49,900
టీకాల పంపిణీ..
దేశంలో కొవిడ్ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 28,40,174 డోసుల వ్యాక్సిన్ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,08,21,66,365 కు చేరింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 4,17,576 మందికి కొవిడ్ (Corona update) సోకింది. కరోనా ధాటికి 6,350 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,02,56,255కు చేరింది. మొత్తం మరణాలు 50,59,832కి చేరాయి.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. 32,479 మందికి వైరస్ సోకింది. మరో 422 మంది చనిపోయారు.
- రష్యాలో మరో 41,335 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజే 1,188 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 30,693 మందికి వైరస్ బారినపడ్డారు. మరో 155 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 27,474 కరోనా కేసులు నమోదవగా.. 203 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో కొత్తగా మరో 26,389 మందికి కొవిడ్ సోకింది. 78 మంది మరణించారు.