దేశంలో.. గడచిన మూడేళ్లలో ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు భారీగా పెరిగినట్లు ఇంటర్పోల్ నివేదికలో తేలింది. 2017-2020 వరకు 24లక్షలకుపైగా కేసులు నమోదైనట్లు స్పష్టమైంది. బాధితుల్లో 80శాతం మంది 14ఏళ్లలోపు బాలికలేనని తేల్చింది.
అంతర్జాలంలో పోర్న్ సమాచారాన్ని పొందుపరచడం కూడా భారీస్థాయిలో పెరిగిపోతుందని ఇంటర్పోల్ అందించిన నివేదికలో వెల్లడైంది.
ఈ క్రమంలో.. ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే ముఠాలపై దృష్టిసారించింది సీబీఐ. ఆ గ్యాంగ్లే లక్ష్యంగా ఇటీవల దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 76 చోట్ల ఏకకాలంలో సోదాలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 50 ఆన్లైన్ సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా దాదాపు 5వేల మంది.. ఈ పోర్న్ సమాచారాన్ని అంతర్జాలంలో పొందుపరుస్తున్నట్లు గుర్తించింది సీబీఐ. దీంతో ప్రపంచంలోని దర్యాప్తు శాఖలతో కలిసి సీబీఐ పనిచేయనుంది. చిన్నారుల్ని లైంగికంగా వేధించిన ఆరోపణలపై ఈనెల 14న 83 మంది నిందితులపై 23 కేసులు నమోదు చేసింది సీబీఐ. వీరిచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు చేస్తున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ సహా.. దిల్లీ, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, బిహార్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది.
ఇదీ చూడండి: యూపీలో ఘోరం.. 72ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం