Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్పల్పంగా పెరిగాయి. కొత్తగా 7,189 మంది వైరస్ బారినపడ్డారు. మరో 387 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 7,286 మంది వైరస్‌ను జయించారు.
మొత్తం కేసులు: 3,47,79,815
మొత్తం మరణాలు: 4,79,520
యాక్టివ్ కేసులు: 77,032
కోలుకున్నవారు: 3,42,23,263
Vaccination in India:
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం మరో 66,09,113 వ్యాక్సిన్ డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,41,01,26,404కు చేరింది.
కరోనా పరీక్షలు
శుక్రవారం ఒక్కరోజే 11,12,195 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 67,10,51,627కు చేరిందని చెప్పింది.
Omicron Cases in India:
మరోవైపు.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా విస్తరిస్తోంది. అనేక రాష్ట్రాల్లో కొత్త కేసులు బయటపడుతున్నాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 415కి చేరింది.
Covid world cases:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజే 8,10,711 కేసులు వెలుగులోకి వచ్చాయి. 5,524 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 27,93,25,715కి చేరింది.
- అమెరికాలో కొత్తగా 1,97,856 కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజే 747 మంది ప్రాణాలు కోల్పోగా 29,257 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- బ్రిటన్‌లో కొత్తగా 1,22,186 మందికి కరోనా సోకగా.. వైరస్ ధాటికి మరో 137 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 94,124 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 167 మంది మృతి చెందగా.. 51,445 మంది కోలుకున్నారు.
- రష్యాపై కరోనా పంజా విసురుతోంది. ఆ దేశంలో కొత్తగా 24,703 మంది వైరస్ బారినపడగా.. మరో 998 మంది మృతిచెందారు.
ఇదీ చూడండి : మహారాష్ట్రలో మళ్లీ కఠిన ఆంక్షలు- కొత్త మార్గదర్శకాలు విడుదల