భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య (Corona Cases in India) క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గింది. కొత్తగా 34,973 మంది వైరస్(Covid-19) బారినపడ్డారు. మరో 260 మంది మరణించారు. ఒక్కరోజే 37,681 మంది కరోనాను జయించారు.
- మొత్తం కేసులు: 3,31,74,954
- మొత్తం మరణాలు: 4,42,009
- మొత్తం కోలుకున్నవారు: 3,23,42,299
- యాక్టివ్ కేసులు: 3,90,646
వ్యాక్సినేషన్
దేశంలో (covid india update) గురువారం 67,58,491 టీకా డోసులు పంపిణీ(covid vaccination) చేయగా.. మొత్తం టీకా డోసుల సంఖ్య 72,37,84,586కు చేరింది.
పరీక్షలు..
దేశవ్యాప్తంగా గురువారం 17,87,611 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రపంచ దేశాల్లో..
ప్రపంచవ్యాప్తంగా కరోనా(Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,07,021 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 9,543 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 22,40,01,493కు చేరగా.. మరణాల సంఖ్య 46,20,028కి పెరిగింది.
కొత్త కేసులు ఇలా..
- అమెరికా - 160,748
- బ్రెజిల్- 30,891
- రష్యా- 18,380
- బ్రిటన్- 38,013
- టర్కీ- 23,846
- ఇరాన్- 26,821
ఇవీ చూడండి:
కరోనా నివారణకు 'చీమల పచ్చడి'.. సుప్రీం ఏమందంటే?