దేశంలో కొవిడ్ ఉద్ధృతి (Covid-19 Updates) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 1,34,154 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 2,887మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,11,499 మంది వైరస్ (covid-19 india) నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 2,84,41,986
- మొత్తం మరణాలు: 3,37,989
- కోలుకున్నవారు:2,63,90,584
- యాక్టివ్ కేసులు: 17,13,413
ఇదీ చదవండి : కరోనా పనిపట్టాలంటే.. కనిపెట్టాల్సిందే!
35 కోట్లు దాటిన టెస్టులు..
బుధవారం ఒక్కరోజే 21,59,873 నమూనాలను(covid-19 testing ) పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 35,37,82,648కి చేరిందని పేర్కొంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి : Pfizer: 'కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం'
వ్యాక్సినేషన్..
దేశంలో మొత్తంగా 22,10,43,693 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: 'టీకాలపై ఆ నివేదికలన్నీ అవాస్తవాలే'