దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కొత్తగా 3,82,315 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 2,06,65,148కు చేరాయి. మరో 3,780 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 2,06,65,148
- మొత్తం మరణాలు: 2,26,188
- మొత్తం కోలుకున్నవారు: 1,69,51,731
- యాక్టివ్ కేసులు: 34,87,229
కొవిడ్ వ్యాప్తి కట్టడిలో భాగంగా మంగళవారం ఒక్కరోజే 15,41,299 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్ టెస్ట్‌ల సంఖ్య 29 కోట్ల 48 లక్షల 52 వేలు దాటింది.
కరోనా కట్టడిలో భాగంగా.. ఇప్పటివరకు మొత్తం 16.04 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఇదీ చదవండి:టీకా తీసుకున్నా కరోనా వస్తుందా?