దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కొత్తగా 4,03,738 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కొవిడ్ బారినపడిన వారిలో మరో 4,092 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 2,22,96,414
- మొత్తం మరణాలు: 2,42,362
- మొత్తం కోలుకున్నవారు: 1,83,17,404
- యాక్టివ్ కేసులు: 37,36,648
ఇదీ చదవండి: 'వారం రోజులుగా 180 జిల్లాల్లో కొత్త కరోనా కేసుల్లేవు'
కొవిడ్ సోకినవారిలో 3,86,444మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 82.15 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు 1.09 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
30 కోట్లు దాటిన పరీక్షలు
దేశవ్యాప్తంగా శనివారం 18.65 లక్షల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 30కోట్ల 22లక్షలు దాటింది.
కరోనా కట్టడిలో భాగంగా.. ఇప్పటివరకు మొత్తం 16.94 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఇదీ చదవండి: రాత్రి కర్ఫ్యూ పర్యవేక్షణకు.. వీధుల్లో తిరిగిన సీఎం