దేశంలో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. తాజాగా 14,199 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 83 మంది వైరస్‌కు బలవ్వగా.. మొత్తం మరణాల సంఖ్య 1లక్షా 56వేల 385కు చేరింది.
- మొత్తం కేసులు: 1,10,05,850
- మరణాలు: 1,56,385
- రికవరీల సంఖ్య: 1,06,99,410
- యాక్టివ్ కేసులు: 1,50,055
ఇదీ చదవండి: కేసుల పెరుగుదలపై అప్రమత్తం..'మహా'లో ఆంక్షలు
కొవిడ్ బారినపడిన వారిలో తాజాగా.. 9,695 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.22 శాతానికి తగ్గింది. మరణాల రేటు స్థిరంగా 1.42 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా మరో 31,681 మందికి కొవిడ్ టీకా అందించినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1కోటీ 11లక్షల 16 వేలు దాటినట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: 'ఆ కరోనా రకాలపై టీకాలూ పనిచేయవ్!'