దేశంలో సోమవారంతో పోల్చితే మంగళవారం కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 13,742 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 104 మంది వైరస్‌కు బలయ్యారు.
- మొత్తం కేసులు: 1,10,30,176
- మరణాలు: 1,56,567
- రికవరీల సంఖ్య: 1,07,26,702
- యాక్టివ్ కేసులు: 1,46,907
కొవిడ్ బారినపడిన వారిలో 14,037 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.25 శాతానికి పెరిగింది. మరణాల రేటు స్థిరంగా 1.42 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా మరో 4,20,046 మందికి కొవిడ్ టీకా అందించినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1కోటీ 21లక్షల 65వేలు దాటినట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: 1.19 కోట్ల టీకా డోసుల పంపిణీ: కేంద్రం