ETV Bharat / bharat

'కేంద్రం వ్యాక్సిన్​ విధానంతో మూడో దశ ముప్పు' - తుపాను గురించి రాహుల్​

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాక్సిన్​ విధానం వల్ల కరోనా మూడో దశ వ్యాపిస్తుందని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ విమర్శించారు. దేశానికి సరైన టీకా​ విధానం కావాలని డిమాండ్​ చేశారు.

rahul gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : May 15, 2021, 7:10 PM IST

దేశంలో సరైన వ్యాక్సిన్ విధానం కావాలని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాందీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రస్తుతం అనుసరిస్తున్న టీకా విధానం.. కరోనా మూడో దశకు దారి తీస్తుందని ట్విట్టర్​ వేదికగా ఆరోపించారు.

"భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విఫలమైన వ్యాక్సిన్​ విధానం వల్ల దేశంలో విధ్వంసకరమైన మూడో దశ వ్యాపిస్తుంది. అది మళ్లీ జరగకూడదు. భారత్​కు సరైన వ్యాక్సిన్​ విధానం కావాలి."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

గంగానది తనను పిలుస్తోందని నాడు వ్యాఖ్యలు చేసిన వారే.. ఇప్పుడు ఆ నది విలపించేలా చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాహుల్​ పరోక్ష విమర్శలు చేశారు. కేరళ, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, గుజరాత్​, కర్ణాటక రాష్ట్రాలకు.. తౌక్టే తుపాను ముప్పు పొంచి ఉందని ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా క్షేమంగా ఉండాలని మరో ట్వీట్​లో రాహుల్​ కోరారు. ఆపదలో ఉన్నవారికి సాయం అందించాలని కాంగ్రెస్​ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: భారత్​కు 5కోట్ల వ్యాక్సిన్ డోసులు?

ఇదీ చూడండి: విద్యార్థిని సరికొత్త మాస్క్​-​ గూగుల్​ మ్యూజియంలో చోటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.