Leopard cub: దాహం తీర్చుకోవడానికి అడవిని వదిలి బయటకు వచ్చిన ఓ చిరుతపులి పిల్ల రెండు రోజులు నరకం చూసింది.
ఆ చిరుత పిల్ల దాహంతో నీరు తాగేందుకు ఓ క్యాన్లో మూతి పెట్టింది. దప్పిక తీరేంత వరకు నీరు తాగింది. తిరిగి తలను బయటకు తీసే క్రమంలో అసలు చిక్కు వచ్చి పడింది. తల ఇరుక్కుపోయింది. సుమారు రెండు రోజుల పాటు తలను అందులోనే ఉంచుకొని అడవి, ఊరు అనే తేడా లేకుండా చక్కర్లు కొట్టింది.
ఇలా వచ్చిన ఆ చిరుత పులి పిల్లను చూసి గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మనిషి కదలికలను గ్రహించిన చిరుత పిల్ల తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. పట్టుకునేందుకు అధికారులు బాగా ఇబ్బంది పడ్డారు.
బద్లాపూర్ కర్జాత్ రోడ్డుపై ఉండే గోరేగావ్ ప్రాంతానికి నీళ్లు తాగేందుకు వచ్చిన ఈ చిరుతపులి పిల్లకు ఏడాది వయస్సు ఉంటుందని అధికారులు చెప్పారు. తలను క్యాన్ నుంచి బయటకు తీశాక.. ఆహారం, నీరు అందించి, చికిత్స అందించినట్లు తెలిపారు. చివరకు బోరివలిలోని సంజయ్ గాంధీ ఉద్యానవనానికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: