ETV Bharat / bharat

'ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు సిద్ధం'

బహుముఖ సవాళ్లను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోందని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ పేర్కొన్నారు. యథాతథ స్థితిని మార్చేందుకు సుదీర్ఘంగా జరుగుతున్న ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదం ప్రపంచ ముప్పుగా పరిణమించిందన్న ఆయన.. దానికి భారత్ బాధిత దేశంగా మారిందన్నారు.

author img

By

Published : Feb 3, 2021, 11:11 AM IST

Updated : Feb 3, 2021, 12:30 PM IST

india-is-progressing-from-made-in-india-to-made-for-the-world-defense-minister-rajnath-singh
'మేక్​ ఫర్ ది వరల్డ్ స్థాయికి ఎదుగుతున్నాం'

సరిహద్దులో యథాతథ స్థితిని మార్చేందుకు సుదీర్ఘంగా జరుగుతున్న ప్రయత్నాలపై భారత్ అప్రమత్తంగానే ఉందని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ అన్నారు. దేశం బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటోందని, అయితే భౌగోళిక సమగ్రతను కాపాడేందుకు ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

aero india 2021
త్రిశూల్ ఆకృతిలో సుఖోయ్ సు-30ఎంకేఐ యుద్ధ విమానాలు

బెంగళూరులో ఏరో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజ్​నాథ్.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్​తో 83 తేజస్ విమానాల తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశంగా మారిందని అన్నారు. ఇప్పుడా ఉగ్రవాదం ప్రపంచదేశాలకు ముప్పుగా పరిణమించిందని చెప్పారు.

aero india 2021
బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ
aero india 2021
ఏరో ఇండియా ప్రారంభోత్సవంలో హెలికాప్టర్ల ప్రదర్శన

రక్షణ రంగంలో సంస్కరణలు

ఎగుమతులకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు 2014 నుంచి కేంద్రం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని వివరించారు రాజ్​నాథ్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పరిమితిని సడలించిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో.. భారతదేశం మేడిన్ ఇండియా నుంచి మేడ్​ ఫర్​ ది వరల్డ్(ప్రపంచం కోసం తయారు చేయడం) స్థాయికి ఎదుగుతోందని చెప్పారు.

aero india 2021
డీఆర్​డీఓ తయారుచేస్తున్న ఐదో తరం యుద్ధవిమానం(నమూానా)

"ఆత్మనిర్భర్ భారత్, ఎగుమతులను పెంపొందించం వంటి లక్ష్యాలను సాధించేందుకు రక్షణ రంగంలో రూ.1.75 లక్షల కోట్ల టర్నోవర్ సాధించాలని ప్రభుత్వం సంకల్పించుకుంది. 2024 నాటికి రక్షణ, ఏరోస్పేస్ రంగంలో వస్తుసేవల ఎగుమతులను రూ.35 వేల కోట్లకు చేర్చాలని నిర్దేశించుకుంది."

- రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

వచ్చే ఏడు-ఎనిమిది సంవత్సరాలలో రక్షణ రంగ ఆధునికీకరణపై రూ.130 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. దేశీయ తయారీపైనే ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు వివరించారు. భారత్​కు సుదీర్ఘ సముద్ర తీరం ఉందని, అక్కడ ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు.

aero india 2021
యుద్ధవిమానం

ఇదీ చదవండి: రైతుల ఆందోళనలకు గ్రెటా థన్​బర్గ్​ మద్దతు

Last Updated : Feb 3, 2021, 12:30 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.