ETV Bharat / bharat

ఈ పదేళ్లు ఎంతో కీలకం: మోదీ

ఎన్​డీఏ కూటమి నేతలో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభం వల్ల ప్రపంచం గతితప్పిందని.. దానిని తిరిగి పట్టాలపై పెట్టేందుకు భారత్​ కీలక పాత్ర పోషించాలని అన్నారు..

author img

By

Published : Jan 30, 2021, 10:43 PM IST

India has big role to play in new world order emerging after COVID-19: PM Modi
ప్రపంచ వృద్ధిలో భారత్​దే కీలక పాత్ర: మోదీ

కరోనా సంక్షోభం వల్ల ప్రపంచం గతితప్పిందని... దానిని తిరిగి పట్టాలపై పెట్టే విషయంలో భారత్​ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి దశాబ్దం లాగే.. ఈ 10ఏళ్లు కూడా ఎంతో కీలకమన్నారు.

ఎన్​డీఏ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని. గతంలో లాగా.. భారత్​ ఈసారి ప్రేక్షక పాత్ర వహించదని స్పష్టం చేశారు.

"మన సంప్రదాయం, వసుదైక కుటుంబం అన్న మన ఆలోచనలను ఆధారంగా పరిస్థితులపై ముందుకు సాగుదాం."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమైన ఒక రోజు అనంతరం ఎన్​డీఏ కూటమి నేతల సమావేశం జరిగింది. అనంతరం ప్రధాని వ్యాఖ్యలను వివరిస్తూ.. పార్లమెంట్​ వ్యవహారాలశాఖ మంత్రి ఈ భేటీపై ఓ ప్రకటనను విడుదల చేశారు.

ఇదీ చూడండి:- షా సమక్షంలో భాజపాలో చేరిన రాజీవ్​ బెనర్జీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.