ఇండో పసిఫిక్‌లో సహకారం బలోపేతం దిశగా భారత్, ఫ్రాన్స్ మంగళవారం చర్చించాయి. నౌకాయానం, అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియాతో త్రైపాక్షిక కూటమి ఏర్పాటు చేసే అవకాశాలనూ పరిశీలించాయి. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ డ్రియన్ మధ్య జరిగిన చర్చల్లో ఇండో పసిఫిక్ ఓసియన్ ఇనిషియేటివ్‌లో భాగమవ్వాలని ఫ్రాన్స్ నిర్ణయించింది.
భారత్-ఐరోపా మధ్య వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందంపై చర్చలను వేగవంతం చేయాల్సిన ప్రాముఖ్యతను ఇరు దేశాలూ గుర్తించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, ప్రపంచ సవాళ్లపై ఇరుపక్షాలు చర్చించాయని తెలిపింది.
ఇదీ చూడండి: 'కరోనా కథ ముగియలేదు.. టీకా ఒక్కటే మార్గం కాదు'