భారత, విదేశీ ఉన్నత విద్యాసంస్థలు కలిసి(కొలాబరేషన్) ఉమ్మడి లేదా డ్యూయల్ డిగ్రీలు ఇచ్చేందుకు వీలు కల్పించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తాజా నిబంధనలతో ఓ ముసాయిదాను రూపొందించింది. దీనిపై ప్రజాభిప్రాయాలను మదింపు చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుంది. యూజీసీ తాజా ముసాయిదా నిబంధనల(2021) ప్రకారం భారత్కు చెందిన ఉన్నత విద్యాసంస్థలు విదేశాల్లోని సంస్థలతో కలిసి పనిచేయవచ్చు. అయితే ఆన్లైన్, ఓపెన్, దూరవిద్యా విధానాలకు మాత్రం ఇవి వర్తించవు.
"భారత విద్యాసంస్థల్లో- కనీసం 3.01 న్యాక్ స్కోరు కలిగినవి లేదా ఎన్ఐఆర్ఎఫ్ విశ్వవిద్యాలయం కేటగిరీలో తొలి 100 ర్యాంకుల్లో నిలిచినవి లేదా పేరెన్నికగన్నవి ఏవైనా టైమ్స్ ఎడ్యుకేషన్ తొలి 500 స్థానాల్లో ఉన్నవి లేదా క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకులను సాధించిన విదేశీ విద్యాసంస్థలతో కలిసి పనిచేయవచ్చు. ఇలా ఇచ్చే డిగ్రీలు లేదా డిప్లొమాలన్నీ భారత ఉన్నత విద్యా సంస్థ అందజేసే వాటితో సమానం."
--యూజీసీ ముసాయిదా
ఇందులో భాగంగా భారత విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులు సంబంధిత విదేశీ సంస్థల్లో పాక్షికంగా కోర్సులు చేయవచ్చని ముసాయిదాలో తెలిపింది.
ఇదీ చదవండి : బలగాల ఉపసంహరణపై సుదీర్ఘంగా సైనిక చర్చలు