ETV Bharat / bharat

టీకా రికార్డ్: వేగంగా 17కోట్ల డోసుల పంపిణీ - india covid vaccinations

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ప్రపంచంలో అత్యంత వేగంగా 17 కోట్ల డోసులను పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. అమెరికా, చైనాలతో పోలిస్తే ముందుగానే ఈ మైలురాయిని చేరుకున్నట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రాల వద్ద టీకా డోసులు అందుబాటులోనే ఉన్నాయని స్పష్టం చేసింది.

VACCINE 17 CRORE
టీకా రికార్డ్: వేగంగా 17 కోట్ల డోసుల పంపిణీ
author img

By

Published : May 10, 2021, 12:51 PM IST

ప్రపంచంలో అత్యంత వేగంగా 17 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసిన దేశంగా భారత్ అవతరించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మైలురాయిని అందుకోవడానికి చైనా 119రోజులు, అమెరికా 115రోజుల సమయం తీసుకున్నాయని తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన 114వ రోజు(మే 9)న భారత్ ఈ మైలురాయిని చేరుకుంది.

సోమవారం ఉదయం 7 గంటల నాటికి 17,01,76,603 టీకా డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం తెలిపింది. 24,70,799 సెషన్లలో వీటిని పంపిణీ చేసినట్లు తెలిపింది.

95,47,102 హెల్త్​కేర్ వర్కర్లకు తొలి డోసు, 64,71,385 మందికి రెండు డోసులు అందించినట్లు పేర్కొంది. ఫ్రంట్​లైన్ కార్యకర్తల్లో 1,39,72,612 మంది తొలి డోసు... 77,55,283 మంది రెండు డోసులు అందుకున్నారని వెల్లడించింది. 18-44 ఏళ్ల వయసు వారిలో 20,31,854 మంది తొలి డోసు అందుకున్నట్లు తెలిపింది. 60 ఏళ్ల పైబడినవారిలో 5,36,74,082 మందికి తొలిడోసు, 1,49,83,217 మందికి రెండు డోసులు అందించినట్లు వివరించింది.

రాష్ట్రాలకు మరిన్ని టీకాలు

మరోవైపు, మూడు రోజుల్లోపు రాష్ట్రాలకు 9 లక్షల టీకాలను పంపించనున్నట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రాలకు టీకాలు అందుబాటులోనే ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపు 18 కోట్ల(17,93,57,860) డోసులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించినట్లు తెలిపింది. వృథాతో కలిపి మొత్తం 16,89,27,797 డోసులను వినియోగించినట్లు తెలిపింది. కోటికిపైగా డోసులు ఇప్పుడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది.

పది రాష్ట్రాల్లోనే కేసులు

దేశంలో తాజాగా నమోదైన 3,66,161 కేసుల్లో 73.91 శాతం పది రాష్ట్రాల్లోనే వెలుగులోకి వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బంగాల్, రాజస్థాన్, హరియాణా రాష్ట్రాల్లో వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్నట్లు తెలిపింది. మృతుల్లో ఈ పది రాష్ట్రాల వాటా 74.38శాతంగా ఉందని పేర్కొంది.. వైరస్ నుంచి కోలుకుంటున్నవారు సైతం ఈ పది రాష్ట్రాల్లో అధికంగా ఉన్నారు. 74.38 శాతం మంది

  • మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా: 16.53శాతం
  • 24 గంటల వ్యవధిలో పెరిగిన యాక్టివ్ కేసులు: 8,589

ఇవీ చదవండి:

బంధనంలో భారత్- ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎలా?

భారత్​లో కాస్త తగ్గిన కరోనా కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.