దేశవ్యాప్తంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ మరో మైలురాయిని అందుకుంది. మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు.. మొత్తం 5కోట్ల 75వేలకుపైగా కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో మంగళవారం(67వ రోజు) ఒక్కరోజే 32.53 లక్షల టీకా డోసులు అందించినట్లు పేర్కొంది.
- వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్తల్లో 79,03,068 మంది తొలి డోసు వేయించుకోగా.. 50,09,252 మంది రెండో మోతాదు తీసుకున్నారు.
- 83,33,713 లక్షల మంది కరోనా యోధులు(ఫ్రంట్లైన్ వర్కర్స్) కరోనా టీకా మొదటి డోసు తీసుకోగా.. 30,60,060 మంది రెండో డోసు అందుకున్నారు.
- 60 ఏళ్లు పైబడిన 2,12,03,700 మందికి వ్యాక్సిన్ మొదటి మోతాదు అందించారు.
- 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే వారిలో 45,65,369 మందికి తొలి డోసు పంపిణీ చేశారు.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జనవరి 16న ప్రారంభమైంది. తొలుత వైద్య సిబ్బందికి టీకా అందించారు. ఆ తర్వాత.. ఫిబ్రవరి 2 నుంచి కరోనా యోధులకు; మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అనారోగ్యంతో సంబంధం లేకుండా.. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు మించిన వారందరికీ వ్యాక్సిన్ సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించింది.
ఇదీ చదవండి: 'మహా'లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు