India Covid Cases: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 10,725 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 68 మంది కొవిడ్‌కు బలయ్యారు. ఒక్కరోజులో 13,528 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.61 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.20 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,43,89,176
- క్రియాశీల కేసులు: 90,707
- మొత్తం మరణాలు: 5,27,556
- కోలుకున్నవారు: 4,37,70,913
Vaccination India: భారత్‌లో గురువారం 31,60,292 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,11,13,94,639 కు చేరింది. గురువారం మరో 4,22,322 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గాయి. గురువారం కొత్తగా 7,06,498 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో దాదాపు 18 వందల మంది చనిపోయారు. మొత్తం కేసులు 60,39,97,553 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 64,82,523 మంది మరణించారు. గురువారం మరో 8,62,416 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 57,88,37,758కు చేరింది.
- జపాన్‌లో కొవిడ్ కేసులు మళ్లీ 2 లక్షలపైన నమోదయ్యాయి. ఒక్కరోజే 2 లక్షల 37 వేల కేసులు, 293 మరణాలు వెలుగుచూశాయి.
- దక్షిణ కొరియాలో కొత్తగా లక్షా 13 వేల కొవిడ్ కేసులు, 108 మరణాలు నమోదయ్యాయి.
- అమెరికాలో గురువారం 59 వేల కేసులు రాగా, 245 మంది చనిపోయారు.
- ఇటలీ, జర్మనీ, తైవాన్లోనూ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి.
ఇవీ చదవండి: బలపరీక్షలో నెగ్గిన నీతీశ్, విపక్షాల ఐక్యతకు పిలుపు, మోదీపై సెటైర్లు
దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ఉచితాలపై ఏకాభిప్రాయం కావాలన్న సుప్రీంకోర్టు