India covid cases: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 6,987 కేసులు నమోదయ్యాయి. మరో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,091 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 3,47,86,802
- మొత్తం మరణాలు: 4,79,682
- యాక్టివ్ కేసులు: 76,766
- కోలుకున్నవారు: 3,42,30,354
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం మరో 32,90,766 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,41,37,72,425కు చేరింది.
Covid world cases
అటు, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 4,81,911 కేసులు వెలుగులోకి వచ్చాయి. 3,907 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,04,611 మందికి పాజిటివ్‌గా తేలినట్లు ఫ్రాన్స్ శానిటరీ అథారిటీ వెల్లడించింది. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు ఇవే.
- అమెరికాలో కొత్తగా 40,458 కేసులు నమోదయ్యాయి. 108 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,37,779కు పెరిగింది.
- ఇటలీలోనూ కరోనా తీవ్రంగానే ఉంది. కొత్తగా 54,762కేసులు బయటపడ్డాయి. 144 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 56 లక్షలు దాటింది.
- రష్యాలో కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదవుతోంది. కరోనా తీవ్రతకు మరో 981 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 25 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం మరణాల సంఖ్య 303,250కు చేరుకుంది.
ఇదీ చదవండి: బ్రిటన్‌లో కొవిడ్ పంజా.. తొలిసారి లక్షకుపైగా కేసులు