దేశంలో కరోనా కేసులు(Coronavirus India) బుధవారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 42,982 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 533 మంది మరణించారు. తాజాగా 41,726 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
మొత్తం కేసులు: 3,18,12,114
మొత్తం మరణాలు: 4,26,290
కోలుకున్నవారు: 3,09,74,748
యాక్టివ్ కేసులు: 4,11,076
టీకాల పంపిణీ
దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 48,93,42,295 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారం కొత్తగా 37,55,115 డోసులు అందించినట్లు పేర్కొంది.
కొవిడ్ పరీక్షలు
బుధవారం ఒక్కరోజే 16,64,030 కొవిడ్ టెస్ట్‌లు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 47,48,93,363కు చేరింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రాష్ట్రాల్లో కేసులు ఇలా..
- కేరళలో కొత్తగా 22,414 కేసులు నమోదయ్యాయి. మరో 19,478 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 108 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మహారాష్ట్రలో కొత్తగా 6,126 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 195 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో ఒక్కరోజే 1,769 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 30 మంది చనిపోయారు.
- ఒడిశాలో కొత్తగా 1,315 మందికి వైరస్ సోకింది. కొవిడ్ కారణంగా మరో 66 మంది మరణించారు.
- తమిళనాడులో కొత్తగా 1,949 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. పొరుగు రాష్ట్రం కేరళలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నెగటివ్ ఫలితం, వ్యాక్సినేషన్ తీసుకున్నట్లుగా ధ్రువపత్రం తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చూడండి: తెరచుకోనున్న జగన్నాథ ఆలయం.. ఆర్టీపీసీఆర్ తప్పనిసరి