ETV Bharat / bharat

ఆ 8 రాష్ట్రాల్లోనే మహమ్మారి వ్యాప్తి అధికం - కొవిడ్​ తాజా వార్తలు

చలికాలంలో కరోనా మహమ్మారి క్రమంగా మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే వైరస్​ వ్యాప్తి అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, దిల్లీ, కేరళల్లో నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది.

India's COVID-19 cases climbed to 93.51 lakh with 41,322 new infections being reported in a day
ఆ ఎనిమిది రాష్ట్రాల్లోనే మహమ్మారి వ్యాప్తి అధికం
author img

By

Published : Nov 28, 2020, 5:02 PM IST

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఎనిమిది రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, బంగాల్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌లలోనే అధికం. మహారాష్ట్రలో శుక్రవారం 6185 కొత్త కేసులు రాగా.. దిల్లీలో 5482, కేరళలో 3966 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

India's COVID-19 cases climbed to 93.51 lakh with 41,322 new infections being reported in a day
రాష్ట్రాలవారీగా కరోనా కేసుల వివరాలు

ప్రతి మిలియన్‌ జనాభాకు లక్ష టెస్ట్‌లు!

మరోవైపు, దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యం కూడా క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 11,57,605 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,161 టెస్టింగ్‌ ల్యాబోరేటరీల్లో (1,175 ప్రభుత్వ, 986 ప్రైవేటు ల్యాబ్‌లు) 13.82 కోట్ల మందికి పరీక్షలు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, ప్రతి మిలియన్‌‌ జనాభాకు గాను లక్ష టెస్ట్‌ల మార్కును దాటింది. ప్రతి మిలియన్‌ జనాభాలో కరోనా నిర్ధరణ పరీక్షల నిర్వహణ.. జాతీయ సగటు కన్నా 23 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్టు కేంద్ర గణాంకాలు సూచిస్తున్నాయి. అలాగే, 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కన్నా తక్కువగా నమోదైంది.

రికవరీ రేటు 93.68%

ఇక రికవరీల విషయానికి వస్తే.. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 87,59,969 మంది కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 93.68 శాతంగా ఉంది. శుక్రవారం దిల్లీలో 5,937మంది డిశ్ఛార్జి అయ్యారు. కేరళలో ఈ సంఖ్య 4,544గా ఉండగా.. మహారాష్ట్రలో 4,089గా ఉంది.

10 రాష్ట్రాల్లోనే 78.5% కొత్త మరణాలు

దేశంలో కొవిడ్‌ బారిన పడి నిన్న ఒక్కరోజే 615 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 1,36,200కి పెరిగింది. అయితే, కొత్తగా నమోదైన 615 మరణాల్లో 485 మంది (78.5శాతం) కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. నిన్న దిల్లీలో అత్యధికంగా 98 మరణించగా.. మహారాష్ట్రలో 85 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మన దేశంలో 4,54,940 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి:దేశంలో మరో 41,332 మందికి కరోనా

ఇదీ చూడండి:జైడస్​ క్యాడిలా శాస్త్రవేత్తలపై ప్రధాని ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.