ETV Bharat / bharat

రోజుకు 10 లక్షల కేసులు.. 5 వేల మరణాలు! - ఐహెచ్‌ఎంఈ

భారత్‌లో మే ప్రథమార్ధంలో కరోనా ఉద్ధృతి గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేశారు మిషిగన్‌ వర్సిటీ శాస్త్రవేత్త భ్రమర్‌ ముఖర్జీ. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ) నమూనా సాయంతో విశ్లేషించిన ఆమె.. జాగ్రత్తలు తీసుకోవడమే నివారణకు అసలైన మార్గమని సూచించారు.

Bramar Mukharjee
భ్రమర్‌ ముఖర్జీ
author img

By

Published : Apr 24, 2021, 6:52 AM IST

భారత్‌లో కొవిడ్‌-19 విజృంభణ.. మే ప్రథమార్ధంలో గరిష్ఠ స్థాయికి చేరుతుందని మిషిగన్‌ విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధుల విభాగం ప్రొఫెసర్‌ భ్రమర్‌ ముఖర్జీ పేర్కొన్నారు. అప్పటికల్లా ప్రభుత్వపరంగా వెల్లడించే రోజువారీ కేసుల సంఖ్య 10 లక్షలకు, మరణాలు 5వేలకు చేరే అవకాశం ఉందని 'ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌' (ఐహెచ్‌ఎంఈ) నమూనా సాయంతో ఆమె విశ్లేషించారు. ఆగస్టు నాటికి ఉద్ధృతి తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.

"వెలుగులోకి రాని కేసులతో కలిపి మొత్తం ఇన్‌ఫెక్షన్లు మే మధ్యనాటికి గరిష్ఠ స్థాయిలో 45 లక్షలకు చేరొచ్చు. పరిస్థితులు దిగజారితే అది 50 లక్షలకూ చేరే ప్రమాదం ఉంది. భారత్‌లో ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసులు మాత్రమే వెల్లడిస్తున్నా పరిస్థితులు అంతకంటే దారుణంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ కఠినమైన లాక్‌డౌన్‌లు విధించడం, మాస్క్‌లు తప్పనిసరిగా ఉపయోగించడం, భారీ సమూహాలను నిషేధించడం, అంతర్రాష్ట్ర రాకపోకలను నియంత్రించడం, వ్యాక్సినేషన్‌ పెంచడం ద్వారా గణాంకాలను తగ్గించవచ్చు.''

- భ్రమర్​ ముఖర్జీ, మిషిగన్​ విశ్వవిద్యాలయం

మే నెలలో కేసులు గరిష్ఠానికి చేరినప్పటికీ మళ్లీ సాధారణ జీవితం గడపగలమని విశ్వసించే స్థాయికి కేసులు, మరణాలు తగ్గడానికి మరికొంత సమయం పడుతుందని ఆమె పేర్కొన్నారు. వైరస్‌ జన్యుపరిణామ క్రమ విశ్లేషణను పెంచడంతోపాటు, ప్రజారోగ్య వ్యవస్థను అత్యంత అప్రమత్తం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అయితే.. భారత్‌కు ఇప్పుడు అంతర్జాతీయ సమాజ సహకారం అవసరమని.. ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.

ఇవీ చదవండి: కరోనాతో నమ్మకం కోల్పోవద్దు: బోబ్డే

'మహా' విలయం- ఒక్కరోజే 66,836 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.