Covid Cases India: దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 1,685 మందికి వైరస్ సోకింది. మరో 83 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,499 మంది వైరస్ను జయించారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. గురువారం మరో 29,82,451 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,82,55,75,126కు పెరిగింది. దేశంలో పాజిటివిటీ రేటు 0.24 శాతంగా నమోదైంది.
- మొత్తం కేసులు: 4,30,16,372
- మొత్తం మరణాలు: 5,16,755
- యాక్టివ్ కేసులు: 21,530
- కోలుకున్నవారు: 4,24,78,087
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని దేశాల్లో కలిపి మరో 16,94,541 కొత్త కేసులు వెలుగుచూశాయి. 4,830 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 47,77,52,112కు చేరగా.. మృతుల సంఖ్య 61,33,020కు పెరిగింది. కరోనా ప్రభావం దక్షిణ కొరియాలో అత్యధికంగా ఉంది. అక్కడ కొత్తగా 3,95,589 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య కోటి దాటింది.
దేశం | కొత్త కేసులు | కొత్త మరణాలు | మొత్తం కేసులు | మొత్తం మరణాలు | |
1 | దక్షిణ కొరియా | 3,95,589 | 470 | 1,08,22,836 | 13,902 |
2 | వియత్నాం | 1,20,000 | 70 | 85,99,751 | 42,145 |
3 | జర్మనీ | 3,05,592 | 261 | 1,97,41,719 | 1,28,457 |
4 | ఫ్రాన్స్ | 1,48,635 | 124 | 2,46,36,311 | 1,41,443 |
5 | ఇటలీ | 81,811 | 182 | 1,41,53,098 | 1,58,436 |