ETV Bharat / bharat

దేశంలో భారీగా తగ్గిన కేసులు.. కొత్తగా 16 వేల మందికి వైరస్​ - కరోనా అప్​డేట్స్​

India covid cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 16,051‬ కేసులు నమోదయ్యాయి. 37,901 మంది కోలుకున్నారు. 206 మంది మరణించారు.

India Corona Cases Today
కరోనా కేసులు
author img

By

Published : Feb 21, 2022, 9:26 AM IST

India covid cases: దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 20వేల లోపునకు పడిపోయింది. కొత్తగా 16,051‬ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 206 మంది మరణించారు. 37,901 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 4,28,38,524‬
  • మొత్తం మరణాలు: 5,12,109
  • యాక్టివ్ కేసులు: 2,02,131
  • మొత్తం కోలుకున్నవారు: 4,21,24,284

Vaccination in India:

దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 7,00,706 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,75,46,25,710కు చేరింది.

World Covid cases:

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఆందోళకరంగానే ఉంది. 24 గంటల వ్యవధిలో 12,79,979 కేసులు బయటపడ్డాయి. రష్యా, జర్మనీ, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • రష్యాలో తాజాగా లక్షా 70 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 745 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 53 లక్షలు దాటింది.
  • జర్మనీలో 1.4 లక్షల కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 65 మంది కరోనాకు బలయ్యారు.
  • బ్రెజిల్​లో రోజువారీ కరోనా మరణాలు సంఖ్య భారీగా ఉంటోంది. 24 గంటల వ్యవధిలో 424 మంది చనిపోయారు. కొత్తగా 40,625 కేసులు వెలుగుచూశాయి.
  • దక్షిణ కొరియాలోనూ లక్షకు పైగా కొవిడ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. 51 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
  • జపాన్, టర్కీ, ఫ్రాన్స్, ఇండోనేసియా దేశాల్లోనూ వైరస్ విజృంభణ తీవ్రంగా కొనసాగుతోంది.

ఇదీ చదవండి: కొవిడ్​పై అలా వ్యవహరించడం మంచిది కాదు: డబ్ల్యూహెచ్​ఓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.