ETV Bharat / bharat

స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ఒమిక్రాన్​@10000​

Covid cases in India: భారత్​లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరో 3,37,704 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజులో 488 మంది మరణించారు. 2,42,676 మంది కొవిడ్​ను జయించారు.

Covid cases in India
కరోనా కేసులు
author img

By

Published : Jan 22, 2022, 9:33 AM IST

Updated : Jan 22, 2022, 9:53 AM IST

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు.. 3,37,704 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 488 మంది మరణించారు. 2,42,676 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.22 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 93.31శాతంగా నమోదైనట్లు పేర్కొంది.

  • మొత్తం కేసులు: 3,89,03,731
  • మొత్తం మరణాలు: 4,88,884
  • యాక్టివ్ కేసులు: 21,13,365
  • మొత్తం కోలుకున్నవారు: 3,63,01,482

Omicron Cases In India

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10,050కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 67,49,746 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,61,16,60,078కు చేరింది.

టెస్టుల ధరలు తగ్గింపు..

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కొవిడ్ టెస్ట్​ల ధరలను తగ్గించాయి. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్​లు ఎక్కువ ధరలు వసూలు చేయకుండా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా ఆర్​టీపీసీఆర్ టెస్ట్ రేటును రూ.100 తగ్గించింది ఝార్ఖండ్. రాష్ట్రంలో రూ.300కు ఆర్​టీ​పీసీఆర్​, రూ.50కి ర్యాపిడ్ యాంటీజెన్​ చేస్తారు. దిల్లీలో ప్రస్తుతం ఆర్​టీపీసీఆర్​ టెస్ట్​కు రూ.300, ర్యాపిడ్ యాంటిజెన్​కు రూ.100 మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీలో ఇంటికే వచ్చి శాంపుల్స్ తీసుకుంటే రూ.500 చెల్లించాలి. ఇంతకు ముందు దీని ధర రూ.700గా ఉండేది. ప్రైవేటు ల్యాబుల్లో టెస్ట్​ల రేటును ఆంధ్రప్రదేశ్​ కూడా తగ్గించింది. ఆర్​టీపీసీఆర్ ధర రూ.350గా నిర్ణయించింది.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 36,32,661 మందికి కరోనా సోకింది. 9,034 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 34,67,86,244కి చేరగా.. మరణాలు 56,03,045కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 7,79,036 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 2,777 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7.1 కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 4,00,851 కేసులు వెలుగుచూశాయి. మరో 233 మంది చనిపోయారు.
  • ఇటలీలో 1,79,106 కొత్త కేసులు బయటపడగా.. 373 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 1,68,820 మందికి వైరస్​ సోకగా.. 396 మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో తాజాగా 1,18,171 కరోనా కేసులు బయటపడగా.. 160 మంది బలయ్యారు.
  • జర్మనీలో 1,38,634 వేల మందికి వైరస్ సోకింది. మరో 175 మంది మృతి చెందారు.
  • బ్రిటన్​లో మరో 95,787 వేల మంది వైరస్ బారిన పడ్డారు.​ 288 మంది మృతి చెందారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: భయపెడుతున్న థర్డ్​ వేవ్​.. సుడిగాలిలా ఒమిక్రాన్‌ విజృంభణ

Last Updated : Jan 22, 2022, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.