Covid Cases in India: దేశంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం 8 గంటల వరకు 16,561 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. పాజిటివిటీ రేటు 4.85 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి 18,053 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.53 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.28 శాతానికి పడిపోయాయి.
- మొత్తం కేసులు: 4,42,23,557
- క్రియాశీల కేసులు: 1,23,535
- మొత్తం మరణాలు: 5,26,928
- కోలుకున్నవారు: 4,35,73,094
Vaccination India: భారత్‌లో గురువారం 17,72,441 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,07,47,19,034కు చేరింది. మరో 3,04,189 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 7,70,436 మంది వైరస్ బారినపడగా.. మరో 1,724 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 59,29,36,079కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,45,795 మంది మరణించారు. ఒక్కరోజే 9,68,940 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,48,72,103కు చేరింది.
- జపాన్‌లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. కొత్తగా 2,43,104 కేసులు నమోదయ్యాయి. 248 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో 1,37,196 కేసులు వెలుగులోకి వచ్చాయి. 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 79,145 కేసులు బయటపడ్డాయి. 290 మంది మరణించారు.
- ఇటలీలో 28,423 మంది వైరస్ బారిన పడ్డారు. 130 మంది మృతి చెందారు.
- బ్రెజిల్లో 27,644 కరోనా కేసులు నమోదయ్యాయి. 173 చనిపోయారు.
తీవ్రత తక్కువున్నా.. చిన్నారులకూ దీర్ఘకాలిక కొవిడ్ ముప్పు
కరోనా బారిన పడ్డ కొందరు చిన్నారుల్లో వ్యాధి లక్షణాలు తక్కువ తీవ్రతతోనే.. ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఆసుపత్రిపాలు కానంత మాత్రాన వారిలో లాంగ్ కొవిడ్ తలెత్తే ముప్పు ఉండదనుకోవడం సరికాదని సూచించింది. అమెరికాలోని టెక్సాస్‌లో 5-18 ఏళ్ల వయసున్న 1,813 మందిపై పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అందులో 4.8% మంది దీర్ఘకాలిక కొవిడ్‌తో ఇబ్బందిపడినట్లు గుర్తించారు. వాసన-రుచి కోల్పోవడం, అలసట, దగ్గు వంటి లక్షణాలు 1.5% మందిలో 4 నుంచి 12 వారాల పాటు ఉన్నాయని.. మరో 3.3% మందిలో అవి 3 నెలల తర్వాత కూడా కొనసాగాయని తేల్చారు. ప్రధానంగా ఊబకాయంతో బాధపడుతున్న చిన్నారులు, టీకా వేయించుకోనివారిలో లాంగ్ కొవిడ్ ముప్పు అధికంగా ఉందని నిర్ధరించారు.
ఇవీ చదవండి: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
మీ సేవలు అమోఘం.. వాక్చాతుర్యం అనంతం.. వెంకయ్యను ప్రశంసిస్తూ ప్రధాని లేఖ