ETV Bharat / bharat

తూర్పు లద్దాఖ్​పై భారత్​, చైనా కీలక చర్చలు - చైనా విదేశాంగ మంత్రి

తూర్పు లద్దాఖ్​లో ప్రస్తుత పరిస్థితి పురోగతిలో ఉందన్నారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్​. చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీతో భేటీ అనంతరం పలు విషయాలు వెల్లడించారు. సరిహద్దు వివాద పరిష్కారమే ప్రధానంగా చర్చలు సాగినట్లు చెప్పారు. సరిహద్దుల వద్ద సాధారణ స్థితి నెలకొంటేనే సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందని స్పష్టం చేశారు.

Jaishankar
వాంగ్​ యీ, జైశంకర్​
author img

By

Published : Mar 25, 2022, 5:09 PM IST

తూర్పు లద్దాఖ్​లో చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్​ యీతో శుక్రవారం దిల్లీలో భేటీ అయ్యారు భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునే అంశంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. తూర్పు లద్దాఖ్​ అంశంపై భారత్​-చైనా మధ్య ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దే పని పురోగతిలో ఉందని, అయితే, నెమ్మదిగా సాగుతోందన్నారు. సరిహద్దుల వద్ద సాధారణ స్థితి నెలకొంటేనే సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందని పేర్కొన్నారు.

Jaishankar
జైశంకర్​తో వాంగ్​ యీ భేటీ

వాంగ్​ యీతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు జైశంకర్​. సరిహద్దు వివాదం పరిష్కారంపై వాంగ్​ యీతో సుమారు 3 గంటల పాటు చర్చించినట్లు చెప్పారు. ఏప్రిల్​ 2020 నుంచి చైనా తీసుకుంటున్న చర్యల కారణంగా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడినట్లు గుర్తుచేశామన్నారు.

" సీనియర్​ మిలిటరీ కమాండర్స్​ మధ్య 15వ విడత చర్చలు ఇటీవల జరిగాయి. దీంతో బలగాల ఉపసంహరణపై పలు ఫ్రిక్షన్​ పాయింట్ల వద్ద పురోగతి కనిపించింది. వివాదం సద్దుమణిగేందుకు బలగాల ఉపసంహరణ పూర్తి చేయటం అవసరం. ఆ దిశగా చర్చలను ముందుకు తీసుకెళ్లాలి. ప్రస్తుత పరిస్థితిలో పురోగతి ఉందని చెప్పగలను. అయితే, అది నెమ్మదిగా సాగుతోంది. ఆ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లటమే ప్రధానంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీతో చర్చించాం. గత రెండేళ్లుగా ఇరు దేశాల సంబంధాలపై సరిహద్దు వివాదం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సరిహద్దులో శాంతి, సామరస్యం అనేవి స్థిరమైన, సహకార సంబంధాలకు పునాదులు."

- ఎస్​ జైశంకర్​, విదేశాంగ మంత్రి.

భారత్​ పట్ల స్వతంత్ర విధానం పాటిస్తారని ఆశిస్తున్నాం: చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ ఓఐసీలో చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు జైశంకర్​. ఈ విషయంపై చర్చించినట్లు చెప్పారు. భారత్​ విషయంలో ఇతర దేశాల ప్రభావం లేకుండా చైనా స్వతంత్ర విధానాన్ని అవలంబిస్తుందని ఆశిస్తున్నట్లు వాంగ్​ యీకి తెలిపామన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు వాంగ్​ యీ పేర్కొన్నారని చెప్పారు. అయితే, స్థిరమైన సంబంధాలను భారత్​ కోరుకుంటుందని స్పష్టం చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'తూర్పు లద్దాఖ్​ నుంచి చైనా పూర్తిగా వైదొలగాల్సిందే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.