తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయ(Galwan Valley)లో భారత్, చైనా సైన్యాల మధ్య జరిగిన పెను ఘర్షణకు మంగళవారంతో ఏడాది పూర్తవుతుంది. నాడు డ్రాగన్ దురాగతాన్ని ఎదిరిస్తూ తెలుగు యోధుడు కర్నల్ సంతోష్ బాబు(Colonel Santosh Babu) నేతృత్వంలోని భారత సైనికులు చూపిన తెగువ, చేసిన బలిదానాన్ని ఈ సందర్భంగా దేశం స్మరించుకోనుంది.
2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. దీంతో దాదాపు 5 దశాబ్దాల తర్వాత రెండు దేశాల సరిహద్దుల్లో తొలిసారి ప్రాణనష్టం సంభవించింది. ఆ పోరులో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబు సహా.. 20 మంది సైనికులు వీరమరణం పొందారు.
ఈ ఘటన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. భారీగా బలగాలు, ఆయుధాలను సరిహద్దుల్లోకి తరలించాయి. గల్వాన్ ఘర్షణల్లో తమ సైనికులు ఐదుగురు చనిపోయినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా మొదటిసారిగా అంగీకరించింది. భారత్, చైనాల విదేశాంగ మంత్రుల మధ్య సంప్రదింపులు, సైనిక చర్చల అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల్లో ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి తీసుకున్నాయి. ఘర్షణకు కేంద్రబిందువుగా ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉపసంహరణ పూర్తికాలేదు.
ఇవీ చదవండి: