దేశంలో కొవిడ్ ఉద్ధృతి(Covid-19 cases) భారీగా తగ్గింది. 63 రోజుల తర్వాత లక్ష కన్నా తక్కువ కేసులు నమోదవటం విశేషం. కొత్తగా 86,498 మంది వైరస్ బారినపడ్డారు. 66 రోజుల కనిష్ఠానికి కేసులు పడిపోవడం ఇదే తొలిసారి. మహమ్మారి ధాటికి మరో 2,123 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,82,282 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరణాల్లోనూ 47 రోజుల తర్వాత ఇంత తక్కువ మోతాదులో నమోదయ్యాయి. రోజువారి కేసుల పాజిటివిటీ రేటు 4.62 కి తగ్గింది.
- మొత్తం కేసులు: 2,89,96,473
- మొత్తం మరణాలు:3,51,309
- కోలుకున్నవారు:2,73,41,462
- యాక్టివ్ కేసులు:13,03,702
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మంగళవారం ఒక్కరోజే 18,73,485 నమూనాలను(covid-19 testing ) పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 36,82,07,596 చేరిందని పేర్కొంది.
ఇప్పటివరకు 23,61,98,726 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఇదీ చదవండి: 'వారికి ముందుగానే రెండో డోసు'