దేశంలో కొత్తగా 18,088 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. మహమ్మారి ధాటికి మరో 264 మంది మరణించారు. తాజా మరో 21 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు:1,03,74,932
- యాక్టివ్ కేసులు: 2,27,546
- మొత్తం రికవరీలు:99,97,272
- మొత్తం మరణాలు: 1,50,114
పెరుగుతున్న రికవరీ..
దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.32 శాతానికి చేరింది. మరణాల రేటు 1.45 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చదవండి:రికార్డు స్థాయిలో తగ్గిన కరోనా కేసులు