ETV Bharat / bharat

టీకా పంపిణీలో ప్రపంచంలోనే భారత్​ టాప్​

దేశంలో ఇప్పటివరకు 8.70 కోట్లకుపైగా కరోనా టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా.. ఒక్కరోజే 33 లక్షల టీకా డోసులు అందించినట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా టీకా అందిస్తోన్న దేశాల్లో తొలిస్థానంలో ఉన్న అమెరికాను అధిగమించి.. సగటున రోజుకు 30లక్షల మందికి టీకా అందిస్తున్నట్లు పేర్కొంది.

India becomes fastest COVID-19 vaccinating country in world, over 8.70 cr doses administered
భారత్​లో అత్యంత వేగంగా టీకా.. 8.70కోట్ల డోసుల పంపిణీ
author img

By

Published : Apr 7, 2021, 2:25 PM IST

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రపంచంలోనే వేగంగా వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు.. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిత్యం సరాసరిన 30లక్షల 93వేల 861డోసుల పంపిణీతో అమెరికాను కూడా అధిగమించినట్లు వివరించింది.

మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 33లక్షల 37వేల 601 డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఇందులో 30లక్షల 8వేల87 మందికి మొదటి డోసు ఇవ్వగా.. 3లక్షల 29వేల 514 టీకాలను రెండో డోసుగా ప్రజలకు అందించినట్లు పేర్కొంది. ఇప్పటివరకు.. 8కోట్ల 70లక్షల 77వేల 474 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు వివరించింది.

  • తొలి డోసు తీసుకున్నవారు 89,63,724
  • రెండో డోసు తీసుకున్నవారు 53,94,913
  • తొలి డోసు లబ్ధిదారులు 3,53,75,953
  • రెండో డోసు లబ్ధిదారులు 10,00,787
  • తొలి డోసు తీసుకున్న 60 ఏళ్లు పైబడినవారు 2,18,60,709
  • 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారులు 4,31,933 (రెండో డోసు)

ఇక దేశంలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా 24 గంటల్లో 1,15,736 మందికి కరోనా వెలుగు చూసింది. ఇవి ఒక్కరోజులో వచ్చిన అత్యధిక కేసులు.

80శాతానికిపైగా...

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్, దిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కేసుల్లో పెరుగుదల ఎక్కువగా ఉంది. కొత్త కేసుల్లో ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచే 80.70 శాతం నమోదవుతున్నాయి.

మంగళవారం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. టీకాల పంపిణీ పురోగతిపై సమీక్షించారు.

మరోవైపు కరోనా నియంత్రణ, నిర్వహణ చర్యల్లో రాష్ట్రాలకు సహాకారం అందించేందుకు 50 ఉన్నత స్థాయి బృందాలను మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్​‌లకు తరలించింది కేంద్రం.

ఇవీ చదవండి: పోలీసుల క్రూరత్వం- మాస్కు లేదని.. నడిరోడ్డుపై!

'జాగ్రత్తలు పాటిస్తూ.. కరోనాపై యుద్ధం చేయాలి'

'ఒంటరిగా ప్రయాణించినా.. మాస్కు తప్పనిసరి'

మాస్కులు, వెంటిలేషన్​ ఉంటే చాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.