భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్(kulbhushan jadhav) తన మరణ శిక్షను అప్పీలు చేసుకునే హక్కుకు అవకాశం కల్పించే బిల్లులో లోపాలను సరిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌ను కోరింది భారత్. జాదవ్ కేసులో అంతర్జాతీయ కోర్టు తీర్పు (ఐసీజే) అమలు చేయాలని పేర్కొంది(ICJ kulbhushan jadhav).
అయితే ఐసీజే ప్రకారం కుల్‌భూషణ్‌కు భారత అధికారులతో సంప్రదింపులు జరుపుకునే అవకాశం కల్పించడంలో పాక్ విఫలమైంది. ఈ కారణంగా జాదవ్‌కు అన్యాయం జరిగిందా? అని నిర్ణయించడానికి మున్సిపల్ కోర్టును ఆహ్వానించేలా ఈ బిల్లులో నిబంధన ఉందని విదేశాంగ మంత్రత్వశాఖ ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇందుకు అవకాశంలేదన్నారు.
ఇటీవల ఈ బిల్లుకు పాక్ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
'కశ్మీర్.. భారత్‌లో అంతర్భాగం'
కశ్మీర్.. భారత్‌లో అంతర్భాగమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రశ్నించినంత మాత్రన వాస్తవంలో మార్పుండదని వ్యాఖ్యానించింది. కశ్మీర్ అంశంలో భారత్‌పై ఆరోపణలు చేస్తూ పాక్ మంత్రి.. ఐరాసకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది భారత్.
డొమినికాతో చురుగ్గా చర్చలు!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ.. అప్పగింత విషయమైన డొమినికాతో చురుగ్గా భారత్ చర్చలు జరుపుతోందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఛోక్సీ.. డొమినికాలో అక్రమంగా ప్రవేశించిన కేసుపై ఇటీవలే విచారణ జరిపిన న్యాయస్థానం.. 25కు వాయిదావేసింది.
ఇదీ చూడండి: Choksi: 'భారత్ పేరు వింటే బీపీ పెరుగుతోంది'