తూర్పు లద్ధాఖ్‌లోని హాట్ స్ప్రింగ్, గోగ్రా, దెప్సాంగ్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియను త్వరగా చేపట్టాలని 11వ విడత కార్ఫ్స్ కమాండర్ స్థాయి చర్చల్లో భారత్ స్పష్టం చేసింది. భారత్లోని చుషుల్ సరిహద్దు పాయింట్ వద్ద శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన చర్చలు.. రాత్రి పదిగంటల వరకు కొనసాగాయి.
అనేకసార్లు చర్చించిన అనంతరం.. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించాయి. అయితే ఘర్షణకు కేంద్ర బిందువులుగా ఉన్న మిగతా ప్రాంతాల్లో సైనిక మోహరింపు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 11వ విడత చర్చల్లో ఆయా ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు భారత్ పట్టుబట్టినట్లు అధికారులు వెల్లడించారు. అది కార్యరూపం దాలిస్తే గోగ్రా లోయ, హాట్ స్ప్రింగ్స్, దెమ్ చోక్ లో ఉద్రిక్తతలు తగ్గి, ప్రశాంతత నెలకొంటుందని వివరించారు.
ఇదీ చదవండి:అమెరికా నౌక సంచారంపై భారత్ తీవ్ర అభ్యంతరం