ETV Bharat / bharat

బలగాల ఉపసంహరణపై సుదీర్ఘంగా సైనిక చర్చలు - భారత్ చైనా సరిహద్దు

భారత్-చైనా మధ్య పదో విడత సైనిక చర్చలు ప్రధానంగా సరిహద్దు ఉద్రిక్తతల నివారణ దిశగా సాగాయి. తూర్పు లద్దాఖ్​లోని ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ కోసం విధివిధానాలపై ఇరు దేశాలు చర్చించాయి.

India and China hold 10th round of military talks; focus on further disengagement in eastern Ladakh
బలగాల ఉపసంహరణ ప్రక్రియ.. మరింత ముందుకు
author img

By

Published : Feb 21, 2021, 5:03 AM IST

Updated : Feb 21, 2021, 7:23 AM IST

సరిహద్దులో మోహరించిన బలగాల ఉపసంహరణ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా భారత్, చైనా మధ్య పదో విడత సైనిక చర్చలు సాగాయి. పాంగాంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఆ ప్రక్రియ ముగిసినందున.. తూర్పు లద్దాఖ్​లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, దెప్సాంగ్ నుంచీ ఉపసంహరించుకోవాలని భారత్​ నొక్కి చెప్పినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

చైనా భూభాగంలోని మాల్దో పోస్టు వద్ద శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన చర్చలు.. ఆర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగాయి. కార్ఫ్స్​​ కమాండర్ స్థాయిలో ఈ భేటీ జరిగింది.

తూర్పు లద్దాఖ్​లో ఉద్రిక్తతల నివారణ చర్యలను వేగవంతం చేయాలని చైనాతో భారత్ గట్టిగా చెప్పినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఆ దిశగా విధాన రూపకల్పనపై ఇరు దేశాలు చర్చించినట్లు వెల్లడించాయి.

ఇదీ చూడండి: సరిహద్దులో తోకముడిచిన చైనా- కారణమేంటి?

Last Updated : Feb 21, 2021, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.