ETV Bharat / bharat

INDIA Alliance Parties Seat Sharing : సీట్ల పంపకంపై ఇండియా కూటమి ముందడుగు.. అక్టోబర్ నుంచి భారీ సభలు - ఇండియా కూటమి సీట్ షేరింగ్

INDIA Alliance Parties Seat Sharing : 2024 లోక్​సభ ఎన్నికల కోసం ఇండియా కూటమి సమాయత్తమవుతోంది. ఇందుకోసం సీట్ల పంపకంపై దృష్టిపెట్టింది. సీట్ల సర్దుబాటుపై చర్చలు ప్రారంభించాలని కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

INDIA Alliance Parties Seat Sharing
INDIA Alliance Parties Seat Sharing
author img

By PTI

Published : Sep 13, 2023, 7:20 PM IST

Updated : Sep 13, 2023, 7:36 PM IST

INDIA Alliance Parties Seat Sharing : 'ఇండియా' పార్టీల మధ్య సీట్ల పంపకం ప్రక్రియ ప్రారంభించాలని ఆ కూటమి సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. కూటమిలోని పార్టీలు దీనిపై చర్చలు జరుపుతాయని తెలిపారు. వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయానికి వస్తాయని స్పష్టం చేశారు. ఇండియా కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశం ఇదే కాగా.. ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ దిల్లీ నివాసంలో బుధవారం ఈ భేటీ నిర్వహించారు. 12 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. "టీఎంసీ ప్రతినిధిగా అభిషేక్ బెనర్జీ సమావేశానికి రాలేకపోయారు. బీజేపీ ప్రతీకార రాజకీయాల్లో భాగంగా ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ఆయనకు సమన్లు ఇచ్చింది. అందుకే ఆయన గైర్హాజరయ్యారు" అని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.

  • #WATCH | On INDIA alliance Coordination Committee meeting, Congress General Secretary KC Venugopal says, "The Coordination Committee has decided to start the process for determining seat-sharing. It was decided that member parties would hold talks and decide at the earliest. The… pic.twitter.com/JnOmapYJ7Z

    — ANI (@ANI) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భోపాల్​లో తొలి సభ
ఈ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కూటమి తరఫున భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలి సభను అక్టోబర్​ తొలి వారంలో భోపాల్​లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ సర్కారు అవినీతిపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు ఉమ్మడి ప్రకటనలో కమిటీ నేతలు తెలిపారు. కులగణన వ్యవహారాన్ని సైతం ప్రస్తావించాలని సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు.

india-alliance-parties-seat-sharing-coordination-committee
సమన్వయ కమిటీ ప్రకటన

ఆ 'న్యూస్ షో'లకు బంద్
అదే సమయంలో.. మీడియా సమావేశాలకు సంబంధించి ఓ సబ్​గ్రూప్​ను ఏర్పాటు చేయాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. ఏఏ న్యూస్ యాంకర్ల కార్యక్రమాల్లో ఇండియా కూటమి నేతలు పాల్గొనకూడదనే విషయంపై ఈ సబ్ గ్రూప్ నిర్ణయానికి వస్తుందని తెలిపింది.

సీట్ల పంపకం.. ఆ రాష్ట్రాల్లో సవాళ్లు!
బీజేపీకి వ్యతిరేకంగా సాధ్యమైనన్ని నియోజకవర్గాల్లో ఒకే అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు సీట్ల పంపకం ఫార్ములాపై వెంటనే ఓ నిర్ణయానికి రావాలని కూటమిలోని కొందరు నేతలు పట్టుబట్టినట్లు సమాచారం. అయితే, అలాంటి ఫార్ములాపై తుది నిర్ణయం తీసుకోవాలంటే పార్టీలన్నీ తమ ఈగోలను పక్కనబెట్టాలని ఇంకొందరు నేతలు వాదిస్తున్నారు. ఇప్పటివరకు సీట్ల పంపకం సూత్రంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలి ఎన్నికల్లో ఆయా సీట్లలో పార్టీలు సాధించిన ఫలితాలను బట్టి దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్​లో సీట్ల పంపకంపై ఇబ్బంది లేదని.. పంజాబ్, దిల్లీ, బంగాల్ విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత వస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

'అది హిందూ వ్యతిరేక కమిటీ'
కాగా, ఇండియా కూటమి సమన్వయ కమిటీని హిందూ వ్యతిరేక కమిటీగా అభివర్ణించింది బీజేపీ. కూటమిలోని పార్టీలన్నీ అవినీతి కేసులను ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించింది. సనాతన ధర్మంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది. హిందూఇజాన్ని అంతం చేయడమే ఇండియా కూటమి అజెండా అని ధ్వజమెత్తింది.

Rahul Gandhi INDIA Alliance : 'విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్!.. ప్రియాంక మా స్టార్​ క్యాంపెయినర్​'

Opposition Meeting : ''ఇండియా' కూటమి 'బలం'.. మోదీ సర్కార్​కు భయం భయం!'

Last Updated : Sep 13, 2023, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.