ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​ తరహాలో హిమాచల్​కూ ముప్పు! - మంచుదిబ్బ

ఉత్తరాఖండ్​లో హిమనీనదం సృష్టించిన బీభత్సంతో దేశం వణికిపోతోంది. అనూహ్యంగా మంచు దిబ్బ విరిగిపడి వరదలు సంభవించాయి. అయితే పెరుగుతున్న సరస్సుల సంఖ్య కూడా వరదలకు కారణమని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. హిమాచల్​ ప్రదేశ్​లో ఈ ముప్పు అధికంగా ఉందని తెలిపింది.

Increasing number of lakes in Himachal Pradesh a cause for concern
ఉత్తరాఖండ్​ తరహాలో హిమాచల్​కు తప్పని ముప్పు!
author img

By

Published : Feb 9, 2021, 1:56 PM IST

ఉత్తరాఖండ్​లో మంచు దిబ్బలు విరిగిపడి పెను బీభత్సం జరిగింది. ఆకస్మిక వరదల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వందల మంది ఆచూకీ గల్లంతైంది. అయితే అధిక సంఖ్యలో సరస్సులు ఏర్పడటమూ వరదలకూ దారితీస్తోందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. భూభాగంలో దాదాపు 5 శాతం హిమనీనదాలున్న హిమాచల్​ ప్రదేశ్​లో వీటి వల్ల ముప్పు అధికంగా ఉందని తెలిపింది.

హిమాచల్​ప్రదేశ్​లోని నదీ పరీవాహక ప్రాంతాల్లో సరస్సుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. పంజాబ్​, హరియాణలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. వాతవరణ మార్పులతో కరుగుతున్న మంచు దిబ్బల వల్ల అధిక సంఖ్యలో సరస్సులు ఏర్పడుతున్నాయి. కొత్తగా ఏర్పడే వాటితో వరదలు సంభవించే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సిమ్లాలోని వాతావరణ మార్పుల కేంద్రం చేసిన అధ్యయనం గతేడాదే ఈ అంశంపై అప్రమత్తం చేసింది.

విస్తీర్ణమూ పెరుగుతోంది..

హిమాచల్​ ప్రదేశ్​లో 2017లో 642 సరస్సులు ఉన్నాయి. 2018 నాటికి వాటి సంఖ్య 769కి పెరిగింది. సట్లెజ్​ పరీవాహక ప్రాంతంలో 16శాతం, చీనాబ్​లో 15 శాతం, రావిలో 12 శాతం సరస్సులు పెరిగాయని ఈ అధ్యయనం తెలిపింది. వేసవిలో వీటి వల్ల ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. సరస్సుల విస్తీర్ణమూ పెరుగుతోందని అధ్యయనం హెచ్చరించింది. రాష్ట్రంలో కనీసం 20 హిమనీనదాలు ప్రమాదంలో ఉన్నాయని అంచనా వేసింది.

'అధ్యయనం చేస్తున్నాం..'

మంచు దిబ్బలకు సంబంధించిన అధ్యయనాలను హిమాచల్​ప్రదేశ్​ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ ఖచి అన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో సరస్సుల విస్తీర్ణాన్ని మదింపు చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: రెండో సొరంగంలో ముమ్మరంగా సహాయక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.