ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో పని చేసే ఓ పనిమనిషికి బలవంతంగా ముద్దు పెట్టాడు ఓ ఉన్నతాధికారి. గదిని శుభ్రం చేయడానికి పిలిచి.. కౌగిలించుకుని ముద్దు పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అధికారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని నుంగబాక్కంలో జరిగింది.
ఇదీ జరిగింది
నుంగంబాక్కంలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో అన్నానగర్‌కు చెందిన రోక్స్ గాబ్రియేల్ ఫ్రాంక్టన్(36) సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే కార్యాలయంలో భర్తను కోల్పోయిన ఓ మహిళ.. గత ఐదేళ్లుగా పనిమనిషిగా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు బలవంతంగా ముద్దు పెట్టాడు. అతడు ఇబ్బంది పెడుతున్నాడని ఉన్నతాధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదు.
దీంతో రోక్స్ తనను లైంగికంగా వేధించాడని నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది ఆ మహిళ. అతడు చాలా సార్లు లైంగికంగా వేధించాడని చెప్పింది. ఫోన్ చేసి తనను నిరంతరం వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. 14న గదిని శుభ్రం చేయడానికి పిలిచాడని.. వెళ్లి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా తనను కౌగిలించుకుని ముద్దు పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది. అతడి వేధింపులు భరించలేక 15 తేదీన ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్ రోక్స్‌ను అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: 'మేకప్‌కు భర్త డబ్బులు ఇవ్వట్లేదు.. విడాకులు ఇప్పించండి'.. కోర్టులో మహిళ పిటిషన్
కూతురిపై బేకరీ యజమాని లైంగిక వేధింపులు! .. పెట్రోల్ పోసి షాప్‌ను తగలబెట్టిన తండ్రి