బంగాల్లో డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. కోల్‌కతా పోర్ట్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించిన ఎస్‌టీఎఫ్ బృందం.. 1.291 కిలోల మాదకద్రవ్యాలను సీజ్ చేసింది. వీటి ధర బహిరంగా మార్కెట్లో రూ. 5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇస్మాయిల్ షేక్, అభిషేక్ సలాం అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిద్దరు మణిపుర్ నుంచి పెద్దఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వీరిచ్చిన సమాచారంతో మరో డ్రగ్ స్మగ్లింగ్ ముఠా గట్టు రట్టు చేశారు.
చాకచక్యంగా..
పక్కా సమాచారంతో మాల్డా జిల్లా గజోల్‌కి చేరుకున్న పోలీసులు.. లలిత్ సేనాపతి, సుమిత్ అలీ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10.068 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.50 కోట్లు ఉంటుందని ఎస్‌టీఎఫ్ బృందం తెలిపింది. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు కోల్‌కతా ఎస్‌టీఎఫ్ జాయింట్ కమిషనర్ సోలమన్ నేసకుమార్ తెలిపారు.
ఇవీ చదవండి: