ETV Bharat / bharat

మద్యం మత్తులో గొడవ.. కోపంతో స్నేహితుడి మర్మాంగాన్ని కోసి... - బహ్రయిచ్​ క్రైమ్​ స్టోరీ

Man cuts friend's genital: యూపీలోని జర్వాల్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు స్నేహితులు.. వాగ్వాదానికి దిగారు. కోపంతో రగిలిపోయిన ఓ వ్యక్తి.. స్నేహితుడు అన్న విషయాన్ని మర్చి.. అతడి మర్మాంగాన్ని కోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

in-up-man-cuts-friends-genitals
కోపంతో స్నేహితుడి మర్మాంగాన్ని కోసి..
author img

By

Published : Dec 31, 2021, 2:22 PM IST

Man cuts friend's genital: 'ముస్తఫా.. ముస్తఫా', 'ట్రెండ్​ మారినా.. ఫ్రెండ్ మారడే' అంటూ స్నేహం విలువను చాటిచెప్పే గొప్ప పాటలు ఎన్నో ఉన్నాయి. స్నేహ బంధం ఎంతో ప్రత్యేకమైనది, విలువైనది! అలాంటి స్నేహానికే మచ్చ తెచ్చే ఘటన ఉత్తర్​ప్రదేశ్ బహ్రాయిచ్​లో జరిగింది. ఓ యువకుడు.. తన స్నేహితుడి మర్మాంగాన్ని కోసేశాడు.

ఇదీ జరిగింది..

జర్వాల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది ఈ ఘటన. పోలీసుల సమాచారం ప్రకారం.. నయీమ్​ అహ్మద్​(30) అనే వ్యక్తి.. ఉత్తర అలీషేర్​ ప్రాంతానికి చెందిన సులేమాన్​.. మంచి స్నేహితులు. జల్వాల్​లో ఒక పని నిమిత్తం.. ఇటీవలే ఇద్దరు కలిశారు. ఆ తర్వాత.. ఇద్దరు బాగా తాగారు. ఆ వెంటనే గొడవపడటం మొదలుపెట్టారు. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడం వల్ల సులేమాన్​ కోపంతో రగిలిపోయాడు. తన వద్ద ఉన్న పదునైన బ్లేడ్​ను తీసుకుని నయీమ్​ అహ్మద్​ మర్మాంగాన్ని కోసేశాడు. ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.

బాధితుడి అరుపులు విన్న స్థానికులు.. ఘటనాస్థలానికి పరిగెత్తారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడిని పోలీసులు ముస్తాఫాబాద్​లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నయీమ్​ పరిస్థితి విషమంగా ఉండటం వల్ల జిల్లా ఆసుపత్రికి సిఫార్సు చేశారు.

in-up-man-cuts-friends-genitals
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. బాధితుడి తరఫు నుంచి ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వివరించారు. ఫిర్యాదు అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- 'ఆత్మలతో మాట్లాడటం' కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయిన మైనర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.