తమిళనాడులో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకోలేదని ప్రియుడిని హతమార్చింది ఓ ప్రేమికురాలు. చెన్నై పింపరి చింద్వారా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
కొద్దికాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రియుడికి ఇప్పటికే పెళ్లైంది. తనను పెళ్లి చేసుకోమని ప్రేయసి అడిగింది. అందుకు అతడు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. కోపోద్రిక్తురాలైన ప్రియురాలు అతడిని గొంతు కోసి దారుణంగా చంపేసింది.
బాధితుని భార్య ఫిర్యాదు మేరకు నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:బావను చంపి.. చెయ్యి నరికిన బావమరిది