తనను కంటికి రెప్పలా చూసుకున్న మావటికి అశ్రునివాళి అర్పించింది ఓ ఏనుగు. ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో జరిగింది.
కూరప్పుడకు చెందిన ప్రసిద్ధ మావటి దామోదరణ్ నాయర్ ఇటీవల మరణించారు. 60ఏళ్లుగా ఆయన ఏనుగులను సంరక్షిస్తున్నారు. పల్లట్ బ్రహ్మదాతన్ అనే ఏనుగుకు పాతికేళ్లుగా సంరక్షకుడిగా ఉన్నారు. వారిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉంది. దీంతో నాయర్ అంత్యక్రియల్లో ఆయనను కడసారి చూడటానికి వచ్చిన బ్రహ్మదాతన్.. కన్నీటి వీడ్కోలు పలికింది.
ప్రముఖ పండుగలకు మావటిగా వచ్చేవారు నాయర్. ఎంతోమందిని ఏనుగుల సంరక్షకులుగా తీర్చిదిద్దిన ఆయన పలు అవార్డులను సైతం పొందారు.
ఇదీ చూడండి: హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏనుగు విడుదల!