కర్ణాటకలో ఓ యువకుడు అగరబత్తి పుల్లలతో రూపొందించిన చేసిన త్రీడీ అయోధ్య రామ మందిరం నమూనా.. రామ భక్తులతో పాటు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌కు చెందిన విజేతా నాయక్.. లాక్‌డౌన్ సమయంలో 3నెలలు కష్టపడి ఈ రామ మందిరాన్ని రూపొందించినట్లు తెలిపాడు.
ఇందుకోసం 2 కిలోల అగరబత్తి పుల్లలు, అలంకరణ కోసం చిన్న సైజు బల‌్బులతో పాటు, ప్లైవుడ్, గమ్ వంటివి వాడినట్లు వివరించాడు.
నమూనాను సురక్షితంగా ఉంచడానికి గ్లాస్ కోటింగ్ చేసినట్లు తెలిపాడు విజేత. దీంతో లైట్ వెలగగానే రామమందిర 3డీ నమూనాగా అది దర్శనమిస్తుంది. అందులో రాముడు విగ్రహం కూడా ఏర్పాటు చేశాడు ఆ యువకడు.
దీనిపై ప్రధానికి లేఖ రాశానంటూ.. అనుమతి లభిస్తే మోదీకి ఈ నముూనాను అందజేస్తానని తెలిపాడు విజేతా నాయక్. ఈ త్రీడీ అయోధ్య రామ మందిరం నమూనాకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదీ చూడండి: అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై మోదీ సమీక్ష