ETV Bharat / bharat

క్షుద్రపూజలు చేస్తున్నారని.. మేనల్లుళ్లే చంపేశారు.. - ఝార్ఖండ్​

క్షుద్రపూజలు చేస్తున్నారనే కారణం, అప్పటికే గొడవలు ఉండటం వల్ల ముగ్గురిని గొడ్డలితో చంపేశారు. బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఝార్ఖండ్​ గుమ్లాలో(Gumla news) జరిగిందీ ఘటన.

in-jharkhand-gumla-relatives-killed-three-people-amid-superstition
క్షుద్రపూజలు చేస్తున్నారని.. మేనల్లుళ్లే చంపేశారు
author img

By

Published : Sep 26, 2021, 10:41 AM IST

Updated : Sep 26, 2021, 11:30 AM IST

ఝార్ఖండ్​ గుమ్లా(Gumla news) జిల్లాలో, మూఢనమ్మకాలు, క్షుద్రపూజల నేపథ్యంలో ఇటీవలి కాలంలో అనేక మంది హత్యకు గురవుతున్నారు. తాజాగా.. క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానంతో సొంత కుటుంబసభ్యులని కూడా చూడకుండా బంధువులు కత్తితో పొడిచి చంపేశారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించింది (Jharkhand crime news).

in Jharkhand gumla, relatives-killed-three-people-amid-superstition
మృతదేహాలు

బంధువులే...

జిల్లాలోని లూటో గ్రామంలో 55 ఏళ్ల బంధన్​ ఒరాన్​, అతడి భార్య సోమరి దేవి, కోడలు బస్మని ఒరాన్​ (40) హత్యకు గురయ్యారు. అంతకుముందు.. సోమరి దేవి క్షుద్రపూజలు చేస్తోందని ప్రచారాలు సాగాయి. అదే సమయంలో వీరికి, వీరి మేనల్లుళ్లు బిపత్​ ఒరాన్​, జులు ఒరాన్​ మధ్య వివాదాలు చెలరేగాయి. వీరు చేస్తున్న క్షుద్రపూజల కారణంగానే తమ కుటుంబసభ్యులు అనారోగ్యం పాలవుతున్నారన్న అనుమానంతో వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

మృతదేహాల వద్ద పోలీసులు

శనివారం రాత్రి.. పని ముగించుకుని ఇంటి వెళ్లాడు బంధన్​. భోజనం చేస్తున్న సమయంలో మేనల్లుళ్లు ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి గొడ్డలితో నరికి చంపారు. అడ్డొచ్చిన సోమరి దేవిని కూడా హతమార్చారు. అరుపులు విని బయటికి వచ్చిన కోడలిని కూడా హత్యచేశారు.

బస్మని ఒరాన్ భర్త.. పని కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లాడు. కాగా.. ఘటన జరిగిన సమయంలో ఇద్దరు చిన్నారులు కూడా అదే ఇంట్లో ఉన్నారు. వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా నిందితులు విడిచిపెట్టారు.

ఘటనాస్థలంలో పోలీసులు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు గల అసలు కారణాలపై నిందితుల నుంచి ఆరా తీశారు.

ఇదీ చూడండి:- దెయ్యం పట్టిందని యువతిని చైన్లతో బంధించి..

Last Updated : Sep 26, 2021, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.