ETV Bharat / bharat

'మనం మరణించాకే పిల్లలకు ఆస్తి ఇవ్వాలి' - an incomplete life autobiograghy

ఆస్తిపాస్తులు తల్లిదండ్రుల మరణించిన తరువాతే పిల్లలకు ఇవ్వాలని ప్రముఖ పారిశ్రామికవేత్త పైలట్‌ విజయ్‌ పత్‌ సింఘానియా తాను రాసిన ఆత్మకథలో పేర్కొన్నారు. 'ఏన్‌ ఇన్‌ కంప్లీట్‌ లైఫ్‌' అనే పేరుతో తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలను అందులో ప్రస్తావించారు.

Vijaypat Singhania
విజయ్‌ పత్‌ సింఘానియా
author img

By

Published : Nov 3, 2021, 8:00 AM IST

తల్లిదండ్రులు తమ మరణానంతరమే పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వాలి తప్ప, తాము జీవించి ఉండగా రాసిస్తే అష్టకష్టాలు తప్పవని పారిశ్రామికవేత్త, పైలట్‌ విజయ్‌ పత్‌ సింఘానియా పేర్కొన్నారు. రేమండ్‌ గ్రూపు సంస్థల మాజీ ఛైర్మన్‌ అయిన సింఘానియా తన ఆత్మ కథ 'ఏన్‌ ఇన్‌ కంప్లీట్‌ లైఫ్‌'లో ఈ మేరకు తన జీవితంలో చోటుచేసుకున్న ఎత్తుపల్లాలను పంచుకున్నారు. ఈ పుస్తకాన్ని పాన్‌ మాక్‌ మిలన్‌ సంస్థ ప్రచురించింది. 2015 ఫిబ్రవరిలో కుటుంబ సభ్యులతో వచ్చిన వివాదం వల్ల సింఘానియా వారసత్వ గృహాన్నీ, ఇతర ఆస్తిపాస్తులను కోల్పోయారు. వాటన్నింటినీ తిరిగి పొందడానికి పోరాడుతున్నారు. "మనం జీవించి ఉండగానే సంతానానికి ఆస్తి రాసివ్వకూడదని గుణపాఠం నేర్చుకున్నాను. మరణానంతరమే మన ఆస్తులు వారికి సంక్రమించాలి. నేను ఇప్పుడు అనుభవిస్తున్న నరకం మరే తల్లిదండ్రులూ అనుభవించకూడదనే ఈ సలహా ఇస్తున్నా" అని సింఘానియా స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన సొంత కార్యాలయానికి వెళ్లలేకపోతున్నారు. కార్యాలయంలోని ముఖ్యమైన పత్రాలు, ఇతర సామగ్రినీ తెచ్చుకోలేకపోతున్నారు. 'ముంబయి, లండన్‌లలో ఉన్న కార్లూ నాకు కాకుండా పోయాయి. నన్ను కార్యాలయానికి రానివ్వడం లేదు. రేమండ్స్‌ ఉద్యోగులెవరూ నాతో మాట్లాడకూడదని నిషేధం విధించారు' అని సింఘానియా వాపోయారు.

నింగిలోకి రివ్వున దూసుకుపోతే..

సింఘానియా వ్యాపారంలోకి దిగే ముందు కొన్నాళ్లు ఆచార్యుడిగా పనిచేశారు. సొంత విమానంలో ఆకాశంలో విహరించడం అంటే ఆయనకు ప్రాణం. గగన విహారానికి సంబంధించి 2 ప్రపంచ రికార్డులను సృష్టించారు కూడా. 1988లో మైక్రోలైట్‌ విమానంలో ఒంటరిగా బ్రిటన్‌ నుంచి భారత్‌కు 23 రోజుల్లో ప్రయాణించడం మొదటి రికార్డు. అనంతరం అదే సంవత్సరం వేడి గాలి నింపిన బెలూన్‌లో సముద్ర మట్టానికి 69,852 అడుగుల ఎత్తులో విహరించి, ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రెండో రికార్డు సృష్టించారు.

ఇదీ చూడండి: డేటా లీక్​ కేసులో నేవీ అధికారులపై సీబీఐ ఛార్జి​షీట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.