ఛత్తీస్గఢ్ సూరజ్పుర్ జిల్లాలోని బిహార్పుర్ అటవీ ప్రాంతంలో ఏడు ఏనుగులు మూర్చపోయాయి. క్రిమిసంహారకాలు తాగడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గ్రామస్థుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న డాక్టర్లు చికిత్స అందించారు.
అయితే.. నాలుగు ఏనుగులు.. కోలుకుని తిరిగి అడవి వైపు వెళ్లిపోయాయని అధికారులు తెలిపారు. మరో మూడు ఏనుగులకు చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు.
కాగా.. బిహార్పుర్ అటవీ ప్రాంతంలో దాదాపు 30 ఏనుగుల గుంపు సంచరిస్తోంది. స్థానిక గ్రామాల్లో పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. గ్రామాలపైకి వచ్చి ఇళ్లను కూల్చేస్తున్నాయని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను అడవుల్లోకి పంపడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి:వీడియోకు పోజులిస్తుండగా.. రైలు ఢీకొని యువకుడు మృతి