ETV Bharat / bharat

రైల్వే వినూత్న ఆలోచన- ఏసీ బోగీల్లో చాక్లెట్ల రవాణా - గోవా నుంచి దిల్లీ సరకు రవాణా

పార్సిల్​ ఎక్స్​ప్రెస్​లోని ఏసీ కోచ్​ల్లో చాక్లెట్లను, ఇతర ఆహార పదార్థాలను నైరుతి రైల్వే శాఖ అధికారులు తొలిసారి తరలించారు. గోవా నుంచి దిల్లీకి ఈ రైలులో సరకులను రవాణా చేశారు.

Railways transports chocolates in AC coaches
రైల్వే ఏసీ కోచ్​ల్లో సరకులు
author img

By

Published : Oct 10, 2021, 11:04 AM IST

నైరుతి ర్వైలే శాఖకు చెందిన హుబ్లీ డివిజన్​ అధికారులు వినూత్న కార్యాచరణ చేపట్టారు. శుక్రవారం తొలిసారి ఏసీ కోచ్​ల్లో చాక్లెట్లు, ఇతర ఆహార పదార్థాలను రవాణా చేశారు. ఈ ఆహార పదార్థాలను తరలించడానికి తక్కువ ఉష్ణోగ్రత కావాల్సినందున ఏసీ కోచ్​లను వినియోగించారు.

అక్టోబరు 8న గోవాలోని వాస్కోడ గామా నుంచి దిల్లీలోని ఓఖ్లాకు వెళ్లే ఏసీ పార్సిల్​ ఎక్స్​ప్రెస్​ రైలులో ఈ ఆహార పదార్థాలను తరలించారు. 18 ఏసీ కోచ్​ల్లో ఏవీజీ లాజిస్టిక్స్ చెందిన 163 టన్నుల బరువున్న చాక్లెట్లు, నూడిల్స్​ను రవాణా చేశారు. 2,115 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఈ రైలు శనివారం దిల్లీకి చేరుకుందని అధికారులు తెలిపారు. దీని వల్ల రైల్వేకు రూ.12.83 లక్షల ఆదాయం సమకూరిందని చెప్పారు.

Railways transports chocolates in AC coaches
రైల్వే ఏసీ కోచ్​లో చాక్లెట్లు

హుబ్లీ డివిజన్​కు చెందిన బిజినెస్​ డెవలప్​మెంట్ యూనిట్(బీడీయూ) అధికారులు... ఈ సరకు రవాణాలో కీలక పాత్ర పోషించారు. సాధారణంగా ఈ తరహా వస్తువులను రోడ్డు మార్గం ద్వారా తరలిస్తారు. కానీ, రైల్వేలో తరలించడం ఇదే మొదటిసారి. బీడీయూ అధికారుల కృషిని డివిజనల్ రైల్వే మేనేజర్​ అరవింద్ మల్ఖెడే ప్రశంసించారు. వేగవంతమైన, సున్నితమైన, తక్కువ ఖర్చుతో కూడిన సేవలను వినియోగదారులకు రైల్వేశాఖ అందిస్తోందని చెప్పారు.

ఫుల్​ ఆదాయం..

రైల్వే ద్వారా సరకు రవాణా చేయడాన్ని పరిశ్రమలు, వ్యాపారులు అభినందిస్తున్నారని నైరుతి రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 2020 అక్టోబరు నుంచి నెలవారీగా రూ.కోటి విలువ చేసే సరకు రవాణా అవుతోందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.11.17 కోట్లను ఆర్జించినట్లు చెప్పింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.