ETV Bharat / bharat

'మాస్కులు ధరించని అభ్యర్థులపై నిషేధం విధించాలి'

కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న అభ్యర్థులు, ప్రచారకర్తలను.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తూ పిటిషన్​ దాఖలు చేశారు ఓ వ్యక్తి. ఈ పిటిషన్​పై దిల్లీ హైకోర్టు విచారణ జరిపింది.

mask, Delhi HC
మాస్కులు ధరించని అభ్యర్థులపై నిషేధం విధించాలి
author img

By

Published : Apr 9, 2021, 6:40 AM IST

ప్రస్తుతం పలు శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నందున.. ప్రచారంలో పాల్గొనేవారంతా తప్పనిసరిగా మాస్కులు ధరించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ డీజీపీ, సెంటర్‌ ఫర్‌ అకౌంటబిలిటీ అండ్‌ సిస్టమిక్‌ ఛేంజ్‌ (సీఏఎస్‌సీ) అధ్యక్షుడు విక్రమ్‌ సింగ్‌ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

కొవిడ్‌ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్న అభ్యర్థులు, ప్రచారకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా వారిపై నిషేధం విధించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు విక్రమ్. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.ఎన్‌.పటేల్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషన్‌లోని అంశాలపై స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, ఈసీకి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:సుప్రీంకోర్టు కొలీజియం భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.